Kanchana 4: రాఘవ లారెన్స్ హారర్ కామెడీ సిరీస్ కాంచన మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాంచన 4 షూటింగ్ మహాభలిపురంలో జోరుగా సాగుతోంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. గత చిత్రాల కంటే ఈ సినిమా మరింత భయానకంగా, నవ్వులు పూయించేలా ఉంటుందని టాక్. లారెన్స్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. గతంలో వచ్చిన కాంచన సినిమాలు తమిళ, తెలుగు మార్కెట్లలో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి.
Also Read: Coolie: కూలీ’లో సంచలనం సృష్టిస్తున్న ‘మోనిక’ సాంగ్ !
ఈసారి కూడా అదే ఊపును కొనసాగించేందుకు దర్శకుడు భారీ బడ్జెట్‌తో సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. మహాభలిపురం షెడ్యూల్ రెండు మూడు రోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత తుది షెడ్యూల్‌తో ఆగస్టులో షూటింగ్ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది. హిందీ మార్కెట్‌లోనూ ఈ చిత్రానికి భారీ ఆదరణ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాంచన 4తో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తామని యూనిట్ ధీమాగా ఉంది.