Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ రెండు వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. బింబిసార 2ను 2026లో ప్రారంభిస్తాడట. అలాగే రైటర్ శ్రీకాంత్ విస్సా దర్శకుడిగా మారుతున్నాడు. ఆయన దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కథకు ఓకే చెప్పాడట. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుందట. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Fauji: ప్రభాస్ ఫౌజీ ఫస్ట్ లుక్ సంచలనం!
అర్జున్ సన్నాఫ్ వైజయంతి తర్వాత కళ్యాణ్ రామ్ బ్రేక్ తీసుకున్నాడు. ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు డబుల్ ధమాకా వార్త వచ్చింది. ముందు బింబిసార సీక్వెల్ బింబిసార 2 ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం 2026 సెకండాఫ్‌లో మొదలవుతుంది. అదే సమయంలో రైటర్ శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో కొత్త సినిమా ఓకే అయింది. శ్రీకాంత్ కథ వినిపించగానే కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. కళ్యాణ్ రామ్ లుక్ ఎలా ఉంటుందని ఆసక్తి పెరిగింది. ఇటీవల ఆయన జిమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో కళ్యాణ్ రామ్ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ పీక్‌లో ఉంది.

