Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెక్రటేరియట్ సమీపంలోని 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తొలుత ఆ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు ఆమె సహా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు వెళ్లారు. అయితే వారిని లోపలికి వెళ్లనీయకుండా పోలీసలుఉ అడ్డుకున్నారు.
Kalvakuntla Kavitha: ఈ సమయంలో ఆమెను కనీసం మొదటి అంతస్థులోనికి వెళ్లడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమె ఆ విగ్రహం ఎదుట కూర్చొని తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. జైభీమ్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిపై కవిత ఈ సందర్భంగా తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. జయంతి సందర్భంగా భారతదేశంలోనే అత్యంత భారీ విగ్రహమైన ఈ విగ్రహానికి కనీసం పూలమాల వేయనీయ్యకపోవడంపై మండిపడ్డారు. ప్రభుత్వం కూడా కనీసం విగ్రహం వద్ద జయంతి వేడుకలు జరపకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha: ఈ సందర్భంగా కొద్దిసేపు నిరసన తెలిపిన అనంతరం ఆమెను మొదటి అంతస్థు వరకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. దాంతో ఆమె, తోటి కార్యకర్తలు, దళిత సంఘాల నేతలతో కలిసి వెళ్లారు.

ఎట్టకేలకు భారీ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కవిత
అనంతరం మొదటి అంతస్థులో కూడా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వరకు అనుమతి ఇవ్వాల్సిందేనని కవిత, ఇతరులు పట్టుబట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఎట్టకేలకు పోలీసులు కవిత, మరికొంత మందికి అనుమతి ఇవ్వడంతో భారీ విగ్రహం వద్ద చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

