Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జపాన్ లో భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. ‘బాహుబలి’ సినిమా అక్కడ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత ప్రభాస్ నటించిన పలు చిత్రాలు అక్కడ విడుదల అయ్యాయి. విశేషం ఏమంటే… ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి’ మూవీ 1200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడీ సినిమా గ్లోబల్ జర్నీలో మరో కీలక అధ్యాయానికి నాంది పలుకబోతోంది. 2025 జనవరి 3న ‘కల్కి 2898 ఎ.డి’ని జపాన్ లోని షోగాట్స్ ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు. కబాటా కైజో ఆధ్వర్యంలోని ట్విన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను పంపిణీ చేయబోతోంది. పురాణాలు, ఫ్యూచరిజంకు ఆవాసమైన జపాన్ లో ‘కల్కి 2898 ఎ.డి’కి మంచి స్పందన లభిస్తుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.