CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇదేరోజు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఒక ఆంగ్ల పత్రిక ఆధ్వర్యంలో జరిగే కాంక్లేవ్‌లో రేవంత్‌రెడ్డి పాల్గొంటారని తెలిసింది. పార్టీ అధిష్ఠానం పెద్దలను కలిసి.. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి నిర్వహించనున్న ఏడాది పాలనా ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా కోరనున్నారని సమాచారం. మహారాష్ట్ర ఎన్నికలపై ప్రచారాంశాలను పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తారని వినికిడి.
CM Revanth Reddy: అనంతరం మంగళవారం రాత్రి, లేదా బుధవారం ముఖ్యమంత్రి హైదరాబాద్ వస్తారని, లేదా అటునుంచి అటే మహారాష్ట్ర వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఒకవేళ హైదరాబాద్ వస్తే ఈ నెల 13న మహారాష్ట్రకు వెళ్తారని వినికిడి. మహారాష్ట్రలో జరిగే వివిధ ప్రచార సభల్లో రేవంత్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఎన్నికల్లో వ్యూహాలను రచించే పనిలో పాల్పంచుకోవాలని అక్కడి కాంగ్రెస్ కూటమి కోరినట్టు తెలిపాయి.