Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంపుహౌస్‌లోని మోటర్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడికి వచ్చిన బీఆర్‌ఎస్ బృందాన్ని పోలీసులు గేట్ దగ్గరే అడ్డుకున్నారు.
పంపుహౌస్‌లోకి వెళ్లేందుకు పర్మిషన్ లేదని పోలీసులు స్పష్టంచేయగా, ఆగ్రహించిన బీఆర్‌ఎస్ నేతలు అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేయకుండా నీటి సరఫరా నిలిపివేశారని ఆరోపించారు.
ప్రాంతంలో పరిస్థితి ఉద్విగ్నంగా మారడంతో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు తమ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేయగా, అధికారులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి చర్చలు జరిపారు.