Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్ వద్ద ఈ రోజు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంపుహౌస్‌ను సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ బృందాన్ని పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు.
పర్మిషన్ లేదని అడ్డుకున్న పోలీసులు
బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపంపుహౌస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని గేటు దగ్గరే నిలువరించారు. లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
మోటర్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
పంపుహౌస్‌లోకి వెళ్లనివ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్కడే గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టాయి. పంపుహౌస్‌లోని మోటర్లను వెంటనే ఆన్ చేసి, నీటిని విడుదల చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. పంటలకు నీరు అందడం లేదని, ప్రాజెక్టును సక్రమంగా నిర్వహించడం లేదని వారు ఆరోపించారు.
