Kajal Aggarwal

Kajal Aggarwal: యాక్సిడెంట్ వార్తలు అవాస్తవం.. నటి కాజల్ అగర్వాల్ స్పందన

Kajal Aggarwal: సోషల్ మీడియాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ గురించి ఒక వార్త వేగంగా వ్యాపించింది. కాజల్ అగర్వాల్‌కు యాక్సిడెంట్ అయ్యిందని, ఆమె తీవ్రంగా గాయపడ్డారని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు పుట్టుకొచ్చాయి. చాలామంది ఆమెను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ, ఆమె ఆరోగ్యం గురించి స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఈ వార్తలపై కాజల్ అగర్వాల్ స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. తాను పూర్తిగా క్షేమంగా, సురక్షితంగా ఉన్నానని, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. “నేను యాక్సిడెంట్‌లో చిక్కుకున్నానని, ఆస్పత్రిలో ఉన్నానని వచ్చిన వార్తలు చూశాను. నిజం చెప్పాలంటే, ఈ వార్తలు చదివి నేను నవ్వుకున్నాను. దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి, వాటిని షేర్ చేయకండి. నిజమైన విషయాలను మాత్రమే పంచుకోండి” అని కాజల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

సినిమా విషయానికి వస్తే, కాజల్ ఇటీవల మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రంలో పార్వతీ దేవి పాత్రలో కనిపించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 3 చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో కూడా ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *