Kajal Aggarwal

Kajal Aggarwal: కాజల్ ది ఇండియా స్టోరీ షూటింగ్ పూర్తి!

Kajal Aggarwal: గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్, నటుడు శ్రేయాస్ తల్పడే (Shreyas Talpade) కలిసి నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సమాజానికి సంబంధించిన ఒక వివాదాస్పద అంశాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం ప్రధానంగా పురుగుమందుల కంపెనీల చుట్టూ తిరుగుతుందని, అందులోని చీకటి కోణాలను, నిజాలను వెలుగులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఇలాంటి ఆలోచింపజేసే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక విభిన్నమైన అనుభూతిని ఇవ్వడం ఖాయం.

Also Read: Samantha: సమంత కమ్‌బ్యాక్: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ షురూ!

చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌ను MIG ప్రొడక్షన్ & స్టూడియోస్ సంస్థ నిర్మించింది. షూటింగ్ పూర్తయిన విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించడంతో పాటు, కొన్ని బిహైండ్ ది సీన్స్ (BTS) ఫోటోలను కూడా పంచుకుంది. సినిమాలోని కథను ముందుకు నడిపించడంలో కాజల్, శ్రేయస్ పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది.

నిర్మాణ విలువలపై రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ‘ది ఇండియా స్టోరీ’ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని ముఖ్య వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కొత్త తరహా కథాంశంతో కాజల్, శ్రేయస్ ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *