KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే.ఏ. పాల్ అమెరికాలో మూడో రాజకీయ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమెరికాను కాపాడాలంటే ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలకుపోయి మరో ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ అవసరముందని వ్యాఖ్యానించారు.
అమెరికన్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు:
పాల్ మాట్లాడుతూ, “గతంలోనే నేను అమెరికాలో ఉన్న సామాజిక నాయకులతో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాను. ఇప్పుడు దానికి మంచి మద్దతు లభిస్తోంది. అందరి దృష్టి ‘అమెరికన్ పార్టీ’ (American Party)పై ఉంది,” అని చెప్పారు.
ఎలాన్ మస్క్‌తో సహకారంపై వ్యాఖ్య:
పాల్ సంచలనంగా, “టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయి. మస్క్ వద్ద డబ్బు ఉంది, నాకు ఫాలోయింగ్ ఉంది. ఇద్దరం కలిస్తే మూడో పార్టీ స్థాపించగలుగుతాం. కానీ మస్క్ ట్రంప్‌తో డీల్ కుదిరితే వెనక్కి తగ్గే అవకాశం ఉంది,” అని వ్యాఖ్యానించారు.
తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై:
పాల్ మరో కీలక విషయాన్ని వెల్లడించారు – “నా కొడుకు అమెరికాలోనే పుట్టి పెరిగాడు. ఆయనను నేను అమెరికా అధ్యక్ష పదవికి సిద్ధం చేస్తున్నాను. అతడికి అధ్యక్షుడవ్వాలన్న కోరిక ఉంది,” అని చెప్పారు.