KA Movie OTT: కిరణ్‌అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం పోటీలోనూ చక్కటి విజయాన్ని అందుకుంది. నయన్ సారిక హీరోయి్ గా సందీప్-సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ గత శుక్రవారం మలయాళంలో రిలీజ్ అయింది. తెలుగులో 50 కోట్ల వసూళ్ళను సాధించిన ఈ సినిమాను మలయాళంలో నటుడు దుల్కర్ రిలీజ్ చేయటం విశేషం. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ ఓటీటీకి రెడీ అయింది. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి ‘క’ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. తన్వీరామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతాన్ని అందించారు. శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్, కె.ఎ ప్రొడక్షన్స్ పై ఈ సినిమాను చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ చూరగొంటుందో చూడాలి.