SS Rajamouli: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేతుల మీదుగా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో స్టార్ లివర్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభం అయింది. లివర్ సంరక్షణ, టాన్స్ ప్లాంటేషన్ లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయిలో ఉన్న ఈ ఇన్ స్టిట్యూట్ నిర్వాహకులు డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి ని అభినందించారు రాజమౌళి. లివర్ అనేది మానవ శరీరంలో ముఖ్యమైన భాగమని, అలాంటి లివర్ కి వరల్డ్ బెస్ట్ ఫెసిలిటీస్ తో సంరక్షణ అందివ్వబోతున్న ఈ ఇన్ స్టిట్యూట్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని తెలిపారు రాజమౌళి. ఇది హైదరాబాద్ లోనే కాదు దేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగి ప్రజలకు ప్రపంచ స్థాయి లివర్ కేర్ అందించాలని కోరారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గుడపాటి రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, వైద్యనిపుణులు, అతిథులు ఆసుపత్రిలోని సౌకర్యాలు ప్రశంసించారు.