Kurnool

Kurnool: కర్నూలులో హృదయ విదారక ఘటన

Kurnool: ఒక మనిషిని బట్టలు విప్పి ఒంటి నిండా కారం పూసి చికెన్ కు ఎలా కాలుస్తామో అలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒకడిని అలానే చేయాలి అని ఉంది. వాడిని ఇలా ఎందుకు అంటున్న అంటే..ఇది చుసిన తర్వాత మీరు కూడా …నువ్వు చెప్పిన శిక్ష చాలా చిన్నది..అంతకు మించి అంటారు. ఎందుకు అలా అంటారో మీరు ఓ లుక్ వేయండి . చూసి ఎలాంటి శిక్షణో చెప్పండి.

కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే సమాజంలో మానవత్వం ఉందా.? అనే అనుమానం కలుగుతుంది. అలాంటి ఘటనే కర్నూలు నగరంలో తాజాగా చోటు చేసుకుంది. నిండా పదేళ్లు కూడా నిండని బాబుకు రంగు పూసి ఎర్రటి ఎండలో కూర్చోబెట్టి భిక్షాటన చేయిస్తోన్న ఉదంతం ఆందోళన కలిగించింది. బాలుడిని తీవ్రంగా కొట్టి.. ఒంటిపై రంగు పూసి రహదారిపై ఓ ముఠా భిక్షాటన చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

Kurnool: ఎండకు తాళలేక బాలుడు అల్లాడిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఈ తతంగాన్ని అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. చిన్నారులతో ఇలాంటి పనులు చేయిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఓ నెటిజన్ ఈ వీడియోను మంత్రి నారా లోకేశ్‌కు ట్వీట్ చేసి బాలుడిని రక్షించాలంటూ కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటూ వారిని ఆదేశించారు. ‘ఇది హృదయ విదారక ఘటన. ప్రతి బిడ్డ.. భద్రత, ప్రేమ, గౌరవానికి అర్హుడు. మేము ఈ చిన్నారిని గుర్తించి, అతనికి అవసరమైన రక్షణ, సంరక్షణ అందేలా చూస్తాము. అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతామని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Carrot Benefits: చలికాలంలో క్యారెట్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *