Junior: ‘జూనియర్’ చిత్రం టాలీవుడ్లో హవాను చూపిస్తోంది. కిరీటీ రెడ్డి హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా మెరిసింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో జూలై 18న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కిరీటీ నటన, డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జెనీలియా శక్తిమంతమైన పాత్రతో తెలుగు తెరకు రీఎంట్రీ ఇచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బలం. బుక్ మై షో ద్వారా 40 వేలకు పైగా టికెట్లు బుక్ కావడం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణను తెలియజేస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా ఊపు మీద ఉంది. ఈ జోష్ రన్ మొత్తంలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
