Judgement:

Judgement: మైన‌ర్‌పై లైంగిక‌దాడి చేసిన 60 ఏళ్ల వృద్ధుడికి 24 ఏళ్ల జైలు

Judgement: మ‌రో కామాంధుడికి ఓ జైలు క‌ఠిన శిక్ష విధించింది. ఎన్ని చ‌ట్టాలు వ‌స్తున్నా, ఎన్ని శిక్ష‌లు అమ‌లవుతున్నా లైంగిక దాడులు, దారుణాలు ఆగ‌డం లేదు. వ‌యోభేదం లేకుండా మైన‌ర్ బాలిక‌ల‌పైనా అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి ద‌శ‌లో న్యాయస్థానాలు కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డి క‌ఠిన శిక్ష‌ల అమ‌లుకు దిగుతున్నాయి. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా శిక్ష‌ల కాలాన్ని పొడిగిస్తూ న్యాయ‌మూర్తులు తీర్పుల‌ను ఇస్తున్నారు. తాజాగా న‌ల్ల‌గొండ పోక్సో కోర్టు కూడా ఓ కామాంధుడికి సంచ‌ల‌న తీర్పును అమ‌లు చేసింది.

Judgement: న‌ల్ల‌గొండ మండ‌లం అన్నేప‌ర్తి గ్రామంలో 2023లో మార్చి 28న త‌న ఇంటిలో ఒంట‌రిగా నిద్రిస్తున్న ప‌దేళ్ల వ‌య‌సున్న చిన్నారిపై 60 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వృద్ధుడు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. త‌ల్లిదండ్రుల‌కు బాధితురాలు చెప్ప‌గా, న‌ల్ల‌గొండ రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు నిందితుడిపై అదే స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

Judgement: రెండేళ్ల‌పాటు న‌ల్ల‌గొండ పోక్సో కోర్టులో విచార‌ణ కొన‌సాగింది. తాజాగా కోర్టు త‌న తీర్పును వెలువ‌రించింది. మైన‌ర్‌పై లైంగిక‌దాడికి ఆరోప‌ణ ఎదుర్కొన్న‌ వృద్ధుడు పాల్ప‌డిన‌ట్టు కోర్టు నిర్ధారించింది. ఈ మేర‌కు ఆ వృద్ధుడికి 24 ఏళ్ల పాటు జైలు శిక్ష‌ను, రూ.40 వేల జ‌రిమానాను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అదేవిధంగా బాధితురాలికి రూ.10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ప్ర‌క‌టించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *