Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జైలు నుంచి ఆయన తాజాగా విడుదల అయ్యారు. కాగా బెయిల్ మంజూరు సమయంలో కొమ్మినేనికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. మహిళలను కించపర్చేలా మరోసారి చేయొద్దని తెలిపింది. అలాగే ఆయనపై పోలీసులు పెట్టిన పలు సెక్షన్లపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ఆ సెక్షన్లు తొలగించాలని, ఇక బెయిల్ కు సంబంధించి అన్ని విషయాలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది. అయితే జర్నలిస్టు కొమ్మినేనిపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
