AP EAPCET 2025 Results

Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు విడుదల.. వివరాల కోసం క్లిక్‌ చేయండి

Jee advanced Results: దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఐఐటీలు, బీఎస్‌ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పుర్ అధికారికంగా ప్రకటించింది. మే 18న జరిగిన ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా సుమారు 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే సుమారు 40 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని అంచనా.

విద్యార్థులు jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఫలితాలను చూడవచ్చు. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ, ఫోన్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. తర్వాత స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపించనున్నది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్తులో ఉపయోగం కోసం ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. ఫలితాల‌తో పాటు తుది సమాధాన కీ (Final Answer Key) కూడా విడుదల చేశారు.

ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఒక్కో షిఫ్ట్‌కు పేపర్ 1, పేపర్ 2గా ఏర్పాటుచేశారు. గణిత విభాగం తలకిందులు సమస్యలతో కఠినంగా ఉండగా, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ప్రశ్నలు మితమైన స్థాయిలో ఉన్నాయని విద్యార్థులు, నిపుణులు తెలిపారు. సమయ నిర్వహణ కీలకంగా మారింది.

జోసా కౌన్సెలింగ్ వివరాలు :
ఫలితాలు వచ్చిన వెంటనే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం ఆరు విడతలుగా JoSAA కౌన్సెలింగ్ జరగనుంది. గతేడాది ఐదు విడతలు మాత్రమే ఉండగా, ఈసారి పోటీ ఎక్కువగా ఉండటంతో ఒక విడతను పెంచారు.

Also Read: IPL 2025: ముంబై ఇండియన్స్ ఓటమితో బాధలో కూరుకుపోయిన హార్దిక్ పాండ్యా

JoSAA 2025 ముఖ్యమైన తేదీలు:

జూన్ 3: రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫైలింగ్ ప్రారంభం
జూన్ 9, 11: మాక్ సీట్ అలాట్‌మెంట్ (Mock Allotment 1 & 2)
జూన్ 12: ఛాయిస్ లాకింగ్
జూన్ 14 నుండి జులై 16 వరకు: ఆరు విడతల కౌన్సెలింగ్ (Round 1 to Round 6)

Jee advanced Results: గతేడాది దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో కలిపి 17,760 సీట్లు అందుబాటులో ఉండగా, ఈ ఏడాది కొన్ని ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రారంభం కావడంతో సీట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. JEE అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే JoSAA కౌన్సెలింగ్‌కు అర్హులు. విద్యార్థులు తమ స్కోర్‌కార్డు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. ఫలితాల ఆధారంగా విద్యార్థులకు కేటగిరీ ర్యాంక్ కూడా ఇవ్వబడింది, ఇది కౌన్సెలింగ్ సమయంలో కీలకంగా మారుతుంది.

ALSO READ  Gandhi Tatha Chettu Review: అవార్డులు అందుకున్న మూవీ ప్రేక్షకుల మనసు గెలిచిందా? గాంధీ తాత చెట్టు.. ఎలావుందంటే . .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *