Jayam Ravi: జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో ఆయన సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అలానే తమిళ కథానాయకుడు ‘జయం’ రవితోనూ ఓ మూవీ చేస్తోంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘కాదలిక్క నేరమిళ్ళై’ సినిమా త్వరలో జనం ముందుకు రాబోతోంది.
ఇది కూడా చదవండి: Guava Juice: చలికాలంలో జామ రసం తాగితే.. మతిపోయే లాభాలు
Jayam Ravi: షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర వ్యవహారాలు జరుపుకుంటున్న ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ‘లావెండర్ నెరమే…’ అనే ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ ప్రేమకథా చిత్రంలో యోగిబాబు, లాల్, వినయ్ కీలక పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. కిరుతిగ ఉదయనిధి దీనికి దర్శకుడు.