Janhvi Kapoor: టాలీవుడ్ లోకి దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు రూ.5 కోట్లు తీసుకున్న ఈ బ్యూటీ, సీక్వెల్ లోనూ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు రామ్ చరణ్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం జాన్వీ రూ.6 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, వచ్చే ఏడాది మార్చిలో సినిమా విడుదల కానుంది.
Also Read: SSMB29 హైప్ డబుల్: పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!
ఇదిలా ఉంటే, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు జాన్వీని సంప్రదించగా, ఆమె రూ.7 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ తగ్గించాలని నిర్మాతలు చర్చలు జరుపుతున్నప్పటికీ, జాన్వీ మాత్రం గట్టిగా నిలబడుతోంది. నార్త్ మార్కెట్ లో ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఆమెను ఎంచుకుంటున్నారు.

