Jammu Kashmir: ఈ చిత్రం విచిత్రమే.. వింతగొలిపే విశేషమే.. విచిత్ర తత్వం.. నదులు, సెలయేళ్లు, హిమపాతాలు జలజలా పారే కశ్మీర్లో కనిపించిన వైచిత్ర్యమ్. కమ్ముకొస్తున్న కరువుకు నిలువుటద్దం. హిమాలయాలకు నిలయమైన ఆ కశ్మీర్లో కరువు పరిస్థితులు తలెత్తుతాయన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలను నిజం చేసే చేదునిజం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కురవాల్సిన హిమపాతంలో 80 శాతం మేర తగ్గుదల కనిపించడమే ఈ విచిత్ర కాలానికి కారణం.
Jammu Kashmir: ఈ ఏడాది తగినంతగా మంచు కురవకపోవడంతో హిమాలయాలు బోడికొండల్లా దర్శనమిస్తున్నాయి. దక్షిణ కశ్మీర్లో సెలయేర్లు ఎండిపోయాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమపాతాల కశ్మీర్లోనే ఈ పరిస్థితులు దాపురిస్తుంటే, దేశంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

