Jammalamadugu

Jammalamadugu: సవాల్ కు సిద్ధమంటున్న ఇద్దరు నేతలు..

Jammalamadugu: ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయాలకు పేటెంట్ ఆ నియోజకవర్గం.. అక్కడ రాజకీయం అంటే ఆషామాషీగా ఉండేది కాదు…అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉన్న ఆ నియోజకవర్గ రాజకీయం మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు పురుడు పోసుకుంటుందా అన్న అనుమానం కలిగిస్తుందట..ఆ ఇద్దరు నేతలు సవాల్ ప్రతి సవాళ్లతో రాజకీయ కాక రేపుతోందట..ఇంతకీ ఉమ్మడి కడప జిల్లాలోని ఏంటా నియోజకవర్గం…

జమ్మలమడుగు అంటే ఉమ్మడి ఏపీలో తెలియని వారుండరు.. ఇక్కడ ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.దేవగుడి పొన్నపురెడ్డి కుటుంబాల దశాబ్దాలుగా రాజకీయ వైరం రగులుతూనే ఉంది.

Jammalamadugu: ఒకప్పటి జమ్మలమడుగు రాజకీయాలు ఎంతలా ఉండేవంటే నాయకులు ఎవరైనా సరే ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే నాటుబాంబులు లేనిది బయటికి వెళ్లలేని పరిస్థితిలో ఉండేవంటేనే అప్పటి ఫ్యాక్షన్ రాజకీయాలకు అద్దం పడుతుంది..90ల కాలంలో జమ్మలమడుగు రాజకీయాలను మాజీ మంత్రి గుండ్లకుంట శివారెడ్డి శాసించేవారు. సీనియర్ ఎన్టీఆర్ హయాంలో మాజీ మంత్రి గుండ్లకుంట శివారెడ్డి తిరుగులేని నేతగా కడప జిల్లాలో ఎదిగారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పెదనాన్న కూడా శివారెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండేవారట .అయితే అప్పట్లో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పెదనాన్నను గుండ్లకుంట శివారెడ్డి హత్య చేయించారనే కారణంతో ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి, శివారెడ్డి కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్ రాజకీయం మొదలైంది.ఈ నేపథ్యంలోనే గుండ్లకుంట శివారెడ్డి, ఆయన తమ్ముని కుమారుడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి లపై హత్య కేసు నమోదయింది. ఈ కేసు కోర్టులో జరుగుతుండగానే మాజీ మంత్రి గుండ్లకుంట శివారెడ్డి హైదరాబాదులో హత్య గావించబడ్డారు.ఇరు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య పదుల సంఖ్యలో అనుచరులు హత్యకు గావించబడ్డారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పెదనాన్న హత్యకు సంబంధించి మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి అతను అనుచరులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు జరుగుతుండగా 2019 ఎన్నికల సమయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు ఇద్దరు నేతలను పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇరువురు నేతలు రాజీ కావడంతో సుప్రీంకోర్టులో రామ సుబ్బారెడ్డి పై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది.

Jammalamadugu: 2019 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి రామసుబ్బారెడ్డి కుటుంబానికి మధ్య చంద్రబాబు నాయుడు సయోధ్య కుదరడంతో ఇద్దరు నేతలు టిడిపిలోనే కొనసాగుతూ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆదినారాయణ రెడ్డి కడప టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలలో ఇరువురి నేతలు ఓటమి పాలవడం, వైసిపి అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపి కండువా కప్పుకున్నరు. మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. అయితే కొంత కాలంగా సైలెంట్ గా ఆ ఇద్దరు నేతలు 2024 సాధారణ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపి నుంచి పోటీ చేసి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రామ సుబ్బారెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం వైసీపీలో కీలకంగా మారడంతో ఆదినారాయణ రెడ్డి ,రామ సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రతిరోజు ఇద్దరు నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలకు దిగడం జమ్మలమడుగు నియోజకవర్గంలో చర్చనీయాంశముగా మారింది. జమ్మలమడుగు లో ఎక్కడ నలుగురు గుమిగూడినా జమ్మలమడుగు నియోజకవర్గంలో నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పైనే చర్చ జరుగుతుందట. జమ్మలమడుగులో మళ్ళీ పాట రోజులు మొదలవుతాయనే భయాందోళనలో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు..మరీ ఆ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఎంత వరకు దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..

మరిన్ని ఏపీ పాలిటిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *