PKL 2024

PKL 2024: పింక్ పాంథర్స్ విజయాల బాట

PKL 2024:  ప్రొ కబడ్డీ సీజన్‌-11లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ పుంజుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో  టైతో పాటు రెండు ఓటములు ఎదుర్కొన్న జట్టు.. మళ్లీ విజయాల బాట పట్టింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన  యుపి యోధాస్ తో జరిగిన పోరులో జైపుర్‌ 33-30తేడాతో విజయం సాధించింది.  రెండు జట్లూ హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ లో ఫస్టాఫ్ సమయానికి యూపీ 17-15తో ఆధిక్యంలో నిలిచింది. కానీ బ్రేక్‌ తర్వాత పుంజుకున్న జైపుర్‌ కీలక సమయంలో పాయింట్లు రాబట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. నీరజ్‌ నర్వాల్‌ 9 పాయింట్లు, అర్జున్‌ దేశ్‌వాల్‌ 5 పాయింట్లు, రెజా 5 పాయింట్లు సాధించి  జట్టును గెలిపించారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 32-26తో దబంగ్‌ ఢిల్లీని ఓడించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Koratala Siva: కొరటాల.. ఇక దేవర2 తోనే సరిపెట్టుకోవాలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *