Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’కు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కబోతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ టీజర్ ను పొంగల్ కానుకగా విడుదల చేశారు. కమల్ హాసన్ ‘విక్రమ్’ తర్వాత వచ్చిన ‘జైలర్’ సైతం పూర్తి స్థాయి వయొలెంట్ మూవీగా రూపుదిద్దుకుంది. ఇప్పుడీ సీక్వెల్ కూడా దానికి ఏమాత్రం తగ్గదని ఈ టీజర్ లో దర్శకుడు నెల్సన్ చెప్పకనే చెప్పాడు. సినిమా గురించి గోవాలో నెల్సన్, అనిరుధ్ ఎలెక్ట్రిక్ మెడిటేషన్ తో ఉండగా… గుండాలను తరుముకుంటూ వచ్చిన రజనీకాంత్ ఊచకోత చూస్తుంటే… ఇది జైలర్ 2.ఓ అనిపిస్తోంది. 2026 పొంగల్ లేదా సమ్మర్ స్పెషల్ గా ‘జైలర్ -2’ వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ లోకేశ్ కనకరాజ్ ‘కూలీ’ మూవీ చేస్తున్నారు.