Jailer 2

Jailer 2: జైలర్ 2 బాలయ్య కాల్‌షీట్స్ ఎన్ని డేస్ అంటే?

Jailer 2: నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “అఖండ 2” షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో భారీ సీక్వెల్‌లో బాలయ్య సంచలన ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన “జైలర్” బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ “జైలర్ 2”లో బాలయ్య కీలక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్ కోసం బాలయ్య ఏకంగా 20 రోజుల కాల్‌షీట్స్ కేటాయించినట్లు సమాచారం. దీంతో ఆయన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని, ఆడియన్స్‌కు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అని టాక్. ఈ హైప్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. బాలయ్య-రజినీ కాంబో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి. ఈ రూమర్స్‌లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *