YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పులివెందులలో తిరుగుబాటు మొదలైందట పులివెందుల పర్యటనకు వచ్చిన ప్రతిసారి క్యాంపు కార్యాలయంలో జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట గత ఐదేళ్లలో నిన్ను నమ్మి కోట్ల రూపాయలు పనులు చేసినప్పటికీ బిల్లులు మాత్రం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట దీంతో ఏం చెప్పుకోలేక అన్నా ఇప్పుడు మీరు బిల్లులు అడగడం ఏంటన్నా ఓపిక పట్టండి అంటూ చెప్పుకుంటున్నారట ఇదే అంశం వైసీపీ క్యాడర్‌ని అయోమయానికి గురి చేస్తోందట 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు నచ్చిన పనులకు అనుమతులు తెచ్చుకున్నారు గ్రామాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రారంభించి కొంత వరకు పూర్తి చేశారు అయితే కొంత మేరకు చెల్లించాల్సిన బిల్లులు ఇంకా క్లియర్ కాలేదని… కొంతమంది కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో పనులు చేశారు.
మరికొంత మంది మధ్యలో పనులు వదిలేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారట…అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిబంధనలు ప్రకారం చేసిన పనులకు మాత్రమే బిల్లులు రావడంతో వైసీపీలో క్యాడర్ ఆందోళనలో మొదలైంది.కేవలం జగన్‌ని నమ్మి పనులు ప్రారంభించామని కొంత మేరకు పనులు కూడా చేసినట్లు వైసీపీ నేతలు వాపోతున్నారట.
YS Jagan: గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా పనుల కేటాయింపు జరిగిందనీ వాటికి సంబంధించిన నిధులపై అధికారులు దృష్టి సారించారట జిల్లా వ్యాప్తంగా పంచాయితీ రాజ్, ఉపాధి హామీ పథకం సంబంధించి గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు కోట్లలో పనులు దక్కించుకున్నారు.నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి కాకుండా నామినేషన్ పద్దతిపై వైసీపీ అనుచరులు పనులు దక్కించుకొని నాసిరకంగా పనులు చేసి కొంత వరకు బిల్లులు ఆమోదం చేసుకున్నారు. నిజాయితిగా పనులు చేసిన కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు ఆమోదం చేసుకోలేకపోయారట… ఇక్కడ వైసీపీ కీలక నేతల అండదండలు ఉన్న వారికి మాత్రం పనులు పూర్తి చేయకపోయినా బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్ళలో జగన్ పులివెందుల పర్యటనకు వచ్చిన క్యాడర్ అందుబాటులో లేకపోవడంతో అడిగే అవకాశం లేకుండా పోయిందట.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ తరచూ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ పేరిట కార్యకర్తలను కలిసేందుకు అవకాశం ఇవ్వడంతో నష్టపోయిన నేతలు అధినేత దగ్గరికి క్యూ కడుతున్నారట… జగన్ దగ్గరికి వస్తున్న వారిలో ఎక్కువ భాగం ఆర్థికంగా నష్టపోయిన వారే ఉన్నారట ఇప్పుడైనా తమ గొడు చెప్పుకుందాం అనుకుంటే జగన్‌ని కలిసేందుకు అవకాశం లేకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహంతో కార్యాలయంపై దాడికి దిగుతున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక్కడ వైసీపీకి చెందిన కొంత మంది నేతలకు మాత్రమే జగన్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తు మిగిలిన వారిని దూరం పెట్టడం కూడా
వారి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.
YS Jagan: పులివెందుల మున్సిపాలిటీలో వందల కోట్ల పనులు దక్కించుకొని వాటిని చేయకుండా కొందరు బిల్లులు పొందారు నిజంగా పనులు చేసిన వారికి ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించలేదని ఆగ్రహంతో ఉన్నారట ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులకు మాత్రమే పనులు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. మిగిలిన వైసీపీ క్యాడర్‌కు మాత్రం ఎక్కడా న్యాయం జరగలేదని వాపోతున్నారట ఇదే విషయం కొంతమంది విజయమ్మ దృష్టికి గతంలో తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయిందట ఇక్కడ ఇప్పుడు వైఎస్ అభిమానులకు న్యాయం లేదు. కేవలం వైఎస్ భారతి చెప్పిన వారికే న్యాయం జరుగుతుందని… తాను ఏం చేయలేనని విజయమ్మ స్వయంగా చెప్పారనే ప్రచారం ఉంది. రాబోయే రోజుల్లో జగన్‌పై నడి రోడ్డులో తిరుగుబాటు తప్పదు అంటున్నారు… ఏం జరుగుతుందో చూడాలి మరి.
రాసినవారు: శివ కుమార్
మహాన్యూస్ స్టాప్ రిపోర్టర్
ఉమ్మడి కడప జిల్లా