Jaanvi Ghattamaneni: టాలీవుడ్లో మరో ఘట్టమనేని వారసురాలు రంగప్రవేశానికి సిద్ధమైంది. సూపర్‌స్టార్ కృష్ణ మనుమరాలు, మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో హీరోయిన్గా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగంలో గుర్తింపు పొందిన మంజుల ఘట్టమనేని–స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ, చిన్నతనం నుంచే కళలపై మక్కువ పెంచుకుంది. నటనతో పాటు డాన్స్, పెయింటింగ్, ఫిట్నెస్, డ్రైవింగ్ వంటి విభాగాల్లో శిక్షణ తీసుకుంది.
ఇప్పటికే జ్యువెలరీ క్యాంపెయిన్ ద్వారా తన అందం, స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీ, టాలీవుడ్లో హీరోయిన్గా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చిన్నతనంలోనే తల్లి మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాలో నటించి తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న జాన్వీ, ఇప్పుడు పూర్తి స్థాయి నాయికగా రాణించడానికి సిద్ధంగా ఉంది.
ఇది కూడా చదవండి: The Family Man 3: ఫ్యామిలీ మ్యాన్-3 రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ సందర్భంగా మంజుల ఘట్టమనేని స్పందిస్తూ, “అప్పట్లో నన్ను హీరోయిన్గా చూడవద్దని కోరిన అభిమానులే, ఇప్పుడు నా కుమార్తె సినిమాల్లోకి రావాలని కోరుతున్నారు. నా జీవిత ప్రార్థనలకు జాన్వీ చిరునవ్వు సమాధానం” అని భావోద్వేగంగా చెప్పారు.
జాన్వీ సినీ రంగ ప్రవేశంపై ఘట్టమనేని అభిమానులు, మహేష్ బాబు ఫ్యాన్స్ భారీగా స్పందిస్తున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు టాలీవుడ్లోకి రావడం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు