IT Raids:

IT Raids: టాలీవుడ్‌పై మూడో రోజూ ఐటీ రైడ్స్‌.. 15 మంది ఇండ్ల‌లో సోదాలు

IT Raids:టాలీవుడ్ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌, ఫైనాన్స‌ర్ల‌ ఇండ్ల‌లో మూడోరోజైన గురువారం కూడా ఐటీ అధికారుల సోదాలు కొన‌సాగ‌తున్నాయి. నిర్మాత దిల్‌రాజు, మైత్రీ మూవీస్ మేకర్స్ న‌వీన్ ఎర్నేని ఇళ్ల‌లో అధికారుల బృందాలు త‌నిఖీలు చేప‌ట్టారు. డైరెక్ట‌ర్‌ సుకుమార్‌, మ్యాంగో అధినేత రామ్ ఇండ్ల‌లో కూడా సోదాలు జ‌రిగాయి.

IT Raids:పుష్ప 2 సినిమా ద‌ర్శ‌కుడైన సుకుమార్ ఇంటిలో ప‌లు ప‌త్రాల‌ను ఐటీ అధికారులు ప‌రిశీలిస్తున్నారు. ప‌లు సినిమాల‌కు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, కార్యాల‌యాల్లో అధికారుల సోదాలు కొన‌సాగుతున్నాయి. అదే విధంగా నిర్మాత నెక్కంటి శ్రీధ‌ర్ నివాసంతోఆప‌టు ఇటీవ‌ల విడుద‌లైన భారీ సినిమాల నిర్మాత‌ల ఇండ్ల‌లోనూ ఈ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి.

IT Raids:2021 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఐటీ రిట‌ర్న్స్‌ను ప‌రిశీలిస్తున్నారు. వాటిని ఆయా సినిమాల్లో వ‌చ్చిన ఆదాయంతో పోల్చుతూ విచార‌ణ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురి ఇండ్లు, కార్యాల‌యాల్లో ప‌లుమార్లు డాక్యుమెంట్ల‌ను అధికారులు ప‌రిశీలించారు. నిర్మాత‌లు ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి, చెర్రీ, అభిషేక్ అగ‌ర్వాల్ నివాసాల్లో అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *