HYD IT Raids: హైదరాబాద్‌లో ఐటీ అధికారులు మంగళవారం ఉదయం భారీ సోదాలు చేపట్టారు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటి వద్ద, ఆయన కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డీఎస్‌ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్, డీఎస్‌ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలు, కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు గాలిస్తున్నారు.
సమాచారం ప్రకారం, గత ఐదేండ్ల పన్ను చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయనే అనుమానాలతో ఈ దాడులు ప్రారంభమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, సురారం సహా హైదరాబాద్‌లోనే దాదాపు 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కంపెనీ ఎంపీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ ఇండ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ దాడుల్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన డీఎస్‌ఆర్ గ్రూప్‌లో భాగస్వామిగా ఉన్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ బలగాల సహకారంతో ఐటీ బృందాలు డాక్యుమెంట్లు, లావాదేవీల రికార్డులను సేకరిస్తున్నాయి.