AP High Court: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్‌పై ఓ మాజీ ఐఏఎస్ అధికారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల వచ్చిన ఆయన సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను వాడారంటూ ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని, దీనికోసం సిఫారసు చేయాలని హైకోర్టును కోరారు.
AP High Court: హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను వారం రోజులపాటు హైకోర్టు వాయిదా వేసింది.
AP High Court: ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ విజయకుమార్ తరఫున న్యాయవాది బాల కోరారు. ఈ దశలో తాము నోటీసులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌పై ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాతే తగిన ఉత్తర్వులను ఇస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులను జారీ చేశారు.
AP High Court: పవన్ కల్యాణ్‌పై ఓ మాజీ ఐఏఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనాన్ని వాడిందన్న అంశం తెరపైకి వచ్చింది. భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆమె ప్రభుత్వ వాహనంలో ప్రయాణించారన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
AP High Court: ఇదిలా ఉండగా, తనకు ప్రభుత్వ అధికారులెవరూ వాహనం పంపలేదని, ఈవెంట్ నిర్వాహకులే తనకు వాహనం ఏర్పాటు చేశారని నటి నిధి అగర్వాల్ తేల్చ చెప్పారు. ఈ విషయంలో వాస్తవాలను చెప్పడం తన బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వాహనం అన్న బోర్డు తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.
