Ram Pothineni

Ram Pothineni: కొత్త జోనర్‌లో అడుగుపెట్టబోతున్న రామ్ పోతినేని?

Ram Pothineni: ఎనర్జీ స్టార్ రామ్ పోతినేని కొత్త జోనర్‌లో అడుగుపెట్టబోతున్నాడు. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, అతీంద్రియ శక్తులు కేంద్రంగా సాగే ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ కథ మొదట రానా, ఆ తర్వాత చైతన్య దగ్గరకు వెళ్లి, చివరకు రామ్‌ను ఆకట్టుకుందని సమాచారం. కిశోర్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి రూపకల్పన చేస్తుండగా, ఆర్కా మీడియా బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది.

Also Read: Rashmika Mandanna: రష్మిక రాణి.. వరుస హిట్లతో సంచలనం!

Ram Pothineni: రానా ఈ ప్రాజెక్టులో సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రా కింగ్‌తో బిజీగా ఉన్న రామ్, ఈ ఏడాది చివరి నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. టాలీవుడ్‌లో కొత్త ఒరవడి సృష్టిస్తూ, రొటీన్ కథలకు భిన్నంగా యువ హీరోలు వైవిధ్యమైన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రామ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడు? ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *