IPL 2025 RCB Captain

IPL 2025 RCB Captain: ఆర్సీబీ కొత్త కెప్టెన్ కోహ్లి కాదు..! గట్టిగా వినిపిస్తున్న ఆ యువ ఆటగాడి పేరు..

IPL 2025 RCB Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. గత 17 ఐపీఎల్ సీజన్లలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయిన ఆర్సీబీ, ఈ సారి కొత్త కెప్టెన్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. డుప్లెసిస్ జట్టుకు దూరమైన తర్వాత ఇప్పటివరకు కోహ్లీ పేరు ప్రచారంలో ఉంటే… తాజాగా కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టేందుకు సముఖంగా లేడని ఒక యువ ప్లేయర్ అతని స్థానంలో జట్టును నడిపిస్తాడని ఇప్పుడు ఖచ్చితమైన వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. ఆ ప్లేయర్ ఎవరో చూద్దామా..?

ప్రతి సీజన్ లో ఆర్సిబి తంతు ఒకటే. జట్టు పేపర్ పైన పైకి బలంగా కనిపిస్తుంది, కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపిస్తుంది కానీ లీగ్ ముగిసే సమయానికి కప్పు ఆ జట్టు చేతిలో కనిపించదు. విరాట్ కోహ్లీ(Virat Kohli), క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ, ఆ జట్టుకు ఇప్పటివరకు టైటిల్ రుచి చూడలేదు. అయినప్పటికీ, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఆర్సీబీ అగ్రశ్రేణి జట్లతో సమానమే. ఈ సారి కూడా ‘ఈ సాలా కప్ నమ్ దే’ అంటూ అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది.

కింగ్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్లు గా ఉన్నప్పుడు కూడా ఆర్సీబీ తలరాత మార్చలేకపోయారు. ఇక ఈ సారి ఎవరు కెప్టెన్ అవుతారనే ప్రచారం సాగుతోంది. కోహ్లీనే మళ్లీ కెప్టెన్ అవుతాడని అనుకున్నప్పటికీ, ఇప్పుడు రెండు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. కోహ్లీ ఆసక్తి చూపకపోవడంతో, యువ క్రికెటర్ రజత్ పటిదార్ పేరు బలంగా వినిపిస్తోంది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, రూ.11 కోట్లకు కొనుగోలు చేసిన అతనికే కెప్టెన్సీ ఇవ్వనున్నారు.

ఇది కూడా చదవండి: India vs England: ఇంగ్లాండ్ ను కెలికేసిన గిల్.. వన్డే సిరీస్ క్లిన్ స్వీప్ చేసిన టీమిండియా!

పాటిదర్ ఇప్పటికే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్ గా ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ సీజన్ లో 9 ఇన్నింగ్స్ లో 428 పరుగులతో రెండవ అత్యధిక రన్నర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో కూడా రజత్ పాటిదార్ తన బ్యాటింగ్ స్కిల్స్ తో అభిమానులను అలరించాడు. 27 మ్యాచ్‌లు ఆడి, 799 పరుగులు సాధించాడు, దీనిలో 7 అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 112.

లేదు… పటిదార్ మరీ కుర్రోడు అనుకుంటే టి20లో ఎంతో అనుభవజ్ఞుడైన కృనాల్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే కృనాల్ ఆల్ రౌండర్ గా, బరోడా కెప్టెన్ గా దేశవ్యాప్త క్రికెట్ లో తన ముద్ర వేసిన విషయం తెలిసిందే. పాండ్యా అన్నగా ముంబై ఇండియన్స్ టైటిల్ లు గెలవడంలో కీలకపాత్ర పోషించిన కృనాల్ ఏడాది నుండి ఆర్సిబికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. మరి కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టి బెంగళూరు అభిమానుల ఆకలి తీర్చే ప్లేయర్ ఎవరన్న విషయంపై ఇప్పుడు తీవ్ర ఆసక్తి నెలకొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *