Kadapa: నిన్న గోపవరం మండలం అటవీ ప్రాంతంలో విఘ్నేష్ అనే యువకుడు ఇంటర్ విద్యార్థిని దస్తగిరమ్మ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో విషాదం నెలకొంది.కొన ఊపిరితో రిమ్స్ లో చికిత్స పొందుతున్న దస్తగిరమ్మ మృతి చెందింది.బద్వేలు పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దస్తగిరమ్మను విగ్నేస్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేదించినట్లు తెలుస్తోంది.నిన్న ఉదయం మాట్లాడేందుకు ఊరి బయట అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళిన విగ్నేష్ ముందస్తు ప్లాన్ ప్రకారం పెట్రోల్ తెచ్చుకొని దస్తగిరమ్మ పై నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించగా తప్పించుకొని రోడ్డు సమీపంలోకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించగా ఈ రోజు ఉదయం దస్తగిరమ్మ మృతి చెందింది.అయితే నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఘటన పై స్పందించి మైరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఎస్పీ కి సూచించారు.జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.నిందితుడు విగ్నేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.విద్యార్థి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిందితుడు విగ్నేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
