Hyderabad: ఒరేయ్ ..మీరు కాలేజీలు నడుపుతున్నారా లేక…కాల్చుకు తింటున్నారా ? కొంచమైనా మానవత్వం ఉండాలి. బిడ్డలు చనిపోతూ ఉన్నా..మీ ర్యంకుల రాక్షసత్వం మారదా ? మీ కన్నా…రోడ్డుపై కుక్కలు మేలు కదా ..ఏవైనా..కొంచం కనికరం తో ఉంటాయి. మీకు అది కూడా లేదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మీ టార్చర్ కు ప్రాణాలు వదులుతున్నారు
విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు విగత జీవులుగా మారి తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. యాజమాన్యాల చదువుల ఒత్తిడి, మార్కుల టెన్షన్‌తో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి.
Hyderabad: విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ మియాపూర్ లోని కల్వరి టెంపుల్ వద్ద ఉన్న ఓ జూనియర్ కళాశాలలో MPC మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శ్రీ చైతన్య కళాశాలకు చేరుకుని నిరసన తెలిపారు. విద్యార్థి మృతి పై విద్యార్థి తల్లి తండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, మానసిక వేధింపుల వల్లే కౌశిక్ రాఘవ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.