Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ కొత్త చిత్రం ‘ఐ వాంట్ టు టాక్’ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆడియన్స్ ను నిరాశ పరిచింది. గతంలోనూ అభిషేక్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేశాయి. అయితే ఈ సినిమా మాత్రం తన కెరీర్ మొత్తంలో దారుణాతి దారుణమైన ఫలితాన్ని అందించటం మర్చిపోలేని విషయం. అభిషేక్ బచ్చన్ నటించిన ముందు సినిమా ‘ఘూమర్’ బాక్సాఫీస్ వద్ద 85లక్షలను వసూలు చేసి ప్లాప్ ముద్ర వేసుకోగా తాజా చిత్రం ‘ఐ వాంట్ టు టాక్’ అంతకంటే దారుణంగా తొలిరోజు కేవలం 25లక్షలను మాత్రమే వసూలు చేసింది. సూర్జిత్ సర్కార్ దర్శకత్వంలో రైజింగ్ సన్ ఫిలిమ్స్, కినో వర్క్ కలసి నిర్మించిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ తో పాటు అహల్య బామ్రూ, బనితా సంధు, జానీ లీవర్ నటించారు. సింగిల్ పేరెంట్ అయిన ఓ తండ్రి ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడితే కుమార్తె తో ఎదురయ్యే పరిణామాలను ఈ సినిమాలో దర్శకుడు డీల్ చేశారు. అయితే స్లో నెరేషన్ కారణంగా ఆడియన్స్ కి సినిమాపై ఆసక్తి లేకుండా పోయింది. మరి రాబోయే ‘బి హ్యాపీ’, ‘హౌస్ ఫుల్ 5’తోనైనా అభిషేక్ పుంజుకుంటాడేమో చూడాలి.