Instagram New Feature: ఇంస్టాగ్రామ్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ తో యాప్ మెసేజింగ్ అనుభవాన్నిమెరుగుపరుస్తుంది. దింతో ఇంస్టాగ్రామ్ యూస్ చేసే వాళ్ళు తదుపరి సారి డైరెక్ట్ మెసేజ్లను (DMలు) షెడ్యూల్ చేయడానికి అనుమతిస్తుంది.
ఈ ఫీచర్ తో ఇంస్టాగ్రామ్ లో టెక్స్ట్ మెసేజ్ మాత్రమే షెడ్యూల్ పెట్టుకోవచ్చు. దీన్ని వల్ల మనం ఏదైనా విషయం తర్వాత చెప్పాలి అని అనుకుంటే ఈ ఫీచర్ తో చాట్ బాక్స్ లో మనం టెక్స్ట్ ని టైప్ చేసి తర్వాత సేండ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేయడంతో ఈ ఫీచర్ ఓపెన్ అవుతుంది. అక్కడ మెసేజ్ చేరుకోవాల్సిన టైం డేట్ ని సెలెక్ట్ చేసుకోవంతో టెక్స్ట్ మెసేజ్ ని షెడ్యూల్ పెటుకోవొచ్చు.
ఇది కూడా చదవండి: Rupee Value: ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి.. కరెన్సీ విలువ ఎలా లెక్కిస్తారంటే..
Instagram New Feature: మెసేజ్ షెడ్యూల్ కావడంతో చాట్ బాక్స్ లో నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడంతో షెడ్యూల్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం షెడ్యూల్ మెసేజ్ డెలీట్ ఆప్షన్ తో పాటు మెసేజ్ ని వెంటనే సేండ్ చేసే ఫీచర్ ఉంటుంది దానికోసం టెక్స్ట్ ని లాంగ్ ప్రెస్ చేయడంవల్ల మెసేజ్ సెండ్ అవుతుంది.
ఈ ఫీచర్ ద్వారా మనం ఏదైనా మెసేజ్ ని 29 డేస్ ముందు వరకు షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ తో మెసేజ్ లో టెక్స్ట్ ని మాత్రమే షెడ్యూల్ పెటుకోవచ్చు వీడియోస్ ,గిఫ్ లు పెట్టుకోవడం కుదరదు.

