Indiramma Indlu:ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల్లో సగానికి పైగా అనర్హులేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. ఇండ్ల నిర్మాణానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో అనర్హుల జాబితా పెరిగింది. దీంతో ఆశతో ఉన్న ఎంతో మంది ఇంటి నిర్మాణానికి దూరమైనట్టయింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల నుంచి నిబంధనల మేరకు ఉన్న వారితో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది.
Indiramma Indlu:ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 77.18 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 41.15 లక్షల మంది అంటే 53.3 శాతం అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. 36.3 లక్షలు అంటే 46.7 శాతం మంది మాత్రమే అర్హులను నిర్ణయించింది. అనర్హులంతా దారిద్య్రరేఖ (బీపీఎల్)కు ఎగువను ఉన్నట్టు నిర్ధారించింది.
ఇవే నిబంధనలు
Indiramma Indlu:ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేసింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు 60 గజాలలోపే కట్టుకోవాలి. బ్యాంకులో రూ.50 వేల కంటే ఎక్కువ క్రాప్‌లోన్ ఉన్నా, కుటుంబం మొత్తానికి రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నా, ట్రాక్టర్ ఉన్నాఇందిరమ్మ ఇల్లుకు అనర్హులని ప్రభుత్వం తేల్చింది.
Indiramma Indlu:గృహనిర్మాణ శాఖ అర్హులు, అనర్హుల వివరాలను ఎల్-1, ఎల్-2, ఎల్-3 విభాగాలు జాబితాలను సిద్ధం చేసి ఉంచింది. ఈ మూడు జాబితాల మేరకు ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్ఠంగా మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. ఇండ్ల దరఖాస్తుల వివరాలను సంబంధిత అధికారులు ఇప్పటికే ఇందిరమ్మ యాప్‌లో నమోదు చేసి ఉంచారు.