Indiramma Indlu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. ఈ మేరకు తొలి విడత లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆ మేరకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను సైతం అందజేసింది. అయితే కొందరికి నిబంధనలు లేకుంటే ఇప్పటికే రద్దు చేశారు. వారి బదులు అర్హులైన ఇతరులకు ఇచ్చే అవకాశం ఉన్నది.
Indiramma Indlu: అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్‌ను అందజేసింది. ఆగస్టు 15వ తేదీలోగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు (మార్కింగ్) పోయకుంటే ఇళ్ల అనుమతులను రద్దు చేసి ఇతరులకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
Indiramma Indlu: ఇళ్లు మంజూరైనా పేదలైన లబ్ధిదారుల చేతిలో డబ్బు లేక ఇంకా మొదలు పెట్టలేకపోతున్నారు. మరికొందరు ఇసుక, ఇతర సామగ్రి దొరకక ముందుకు రావడం లేదు. ఇంకొందరు స్థల సమస్యతో సతమతం అవుతున్నారు. ఈ దశలో పిడుగులాంటి ఈ వార్తతో నోటికాడికి వచ్చిన ఇల్లు రద్దవుతుందేమోనని ఆందోళనలో ఉన్నారు. రుణసహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో ఆగస్టు 15 గడువు విధించవద్దని వేడుకుంటున్నారు.

