Indian Railways: భారతీయ రైల్వే మరోసారి ప్రయాణికుల సౌలభ్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బుక్ చేసిన రైలు టికెట్ తేదీ మారితే కొత్త టికెట్ బుక్ చేయక తప్పని పరిస్థితి. దీంతో రద్దు ఛార్జీల రూపంలో డబ్బు నష్టం కూడా తప్పేది కాదు. అయితే ఇకపై ఆ ఇబ్బందులు దూరం కానున్నాయి. మొదటిసారిగా ప్రయాణికులు తమ కన్ఫామ్ అయిన టికెట్ తేదీని ఆన్‌లైన్‌లోనే ఎలాంటి అదనపు రుసుము లేకుండా మార్చుకునే అవకాశం కల్పించనుంది రైల్వే శాఖ.
