Indian Navy: గోవాలో నౌకాదళానికి చెందిన జలాంతర్గామిని పడవ ఢీకొనడంతో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. గోవా తీరానికి 130 కి.మీ దూరంలో భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి నిన్న పెట్రోలింగ్‌లో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో ఓ బోటులో 13 మంది మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. అనూహ్యంగా బోటు జలాంతర్గామిని ఢీకొని బోల్తా పడింది.
ఇది కూడా చదవండి: Bihar: రెండు వందే భారత్ రైళ్ళపై రాళ్ళ దాడి…
Indian Navy: అందులో ఉన్న మత్స్యకారులంతా నీటిలో మునిగిపోయారు. కొన్ని గంటల పోరాటం తర్వాత, 11 మందిని సజీవంగా రక్షించారు. ఈ ఘటనలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.నేవీకి చెందిన ఆరు నౌకలు, విమానాలు సెర్చ్‌లో పాల్గొంటున్నాయి. మహారాష్ట్రలోని ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సాయంతో మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.రక్షించబడిన 11 మంది మత్స్యకారులు గోవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.