Glowing Skin

Glowing Skin: కేవలం రూ. 20తో.. 40 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా మెరిసే చర్మం మీ సొంతం..!

Glowing Skin: అద్దంలా మెరిసిపోయే చర్మం (Glass Skin) సొంతం చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? దీని కోసం చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ, వేలాది రూపాయలను ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌పై ఖర్చు చేస్తుంటారు. అయితే, చర్మంపై సహజమైన మెరుపు రావాలంటే బాహ్య సౌందర్యం కంటే మన అంతర్గత ఆరోగ్యం చాలా ముఖ్యం. చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా (తేమగా) ఉంచుతూ, అవసరమైన పోషకాలను అందించే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

ఈ క్రమంలోనే వేసవి కాలంలో లభించే ‘మామిడి పండు’ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్‌సీబీఐ (NCBI) పరిశోధనల నివేదిక ప్రకారం.. మామిడి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో ‘కొల్లాజెన్’ ఉత్పత్తిని పెంచి చర్మానికి సరికొత్త యవ్వనాన్ని ఇస్తుంది.

అసలు కొల్లాజెన్ (Collagen) అంటే ఏమిటి?

కొల్లాజెన్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక రకమైన ప్రోటీన్. మన శరీరంలోని మొత్తం ప్రోటీన్లలో దాదాపు 30 శాతం కొల్లాజెనే ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా (Tightness), ప్రకాశవంతంగా (Brightening) ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

  • వయసు పెరిగే కొద్దీ తగ్గుదల: సాధారణంగా 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది.

  • దురలవాట్లతో ముప్పు: ధూమపానం (Smoking), ఎక్కువ చక్కెర తీసుకోవడం, జంక్ ఫుడ్ తినడం మరియు చెడు జీవనశైలి వల్ల ఇది మరింత వేగంగా తగ్గిపోతుంది. ఫలితంగా చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, నల్లటి మచ్చలు వచ్చి ముసలితనం (Aging) లక్షణాలు కనిపిస్తాయి.

మామిడి పండు కొల్లాజెన్‌ను ఎలా పెంచుతుంది?

మార్కెట్లో మామిడి పండ్లు చాలా తక్కువ ధరకే సులభంగా లభిస్తాయి. ఈ పండ్లను రోజూ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్-సి సరైన మోతాదులో అందుతుంది. ఈ విటమిన్-సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి సహాయపడుతుంది. మామిడి పండులో విటమిన్-సి తో పాటు విటమిన్-ఎ, ఫైబర్ (పీచు పదార్థం) వంటి ఇతర పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి శరీరంలో హైడ్రేషన్ (నీటి శాతం) స్థాయిని సమతుల్యంగా ఉంచి, చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

మామిడి పండును డైట్‌లో ఎలా చేర్చుకోవాలి?

  • ముక్కలుగా కోసుకుని తినడం: మామిడి పండును తినడానికి అత్యంత ఉత్తమమైన మార్గం.. దాన్ని ముక్కలుగా కోసుకుని ప్లేట్‌లో పెట్టుకుని నేరుగా తినడం. దీనిని తినడానికి ఉత్తమమైన సమయం ‘మిడ్ మార్నింగ్’ (ఉదయం 11 గంటల సమయంలో) లేదా సాయంత్రం 4 గంటల సమయంలో.

  • మ్యాంగో షేక్ (Mango Shake): మామిడి ముక్కలు, పాలను బ్లెండ్ చేయడం ద్వారా ఈ షేక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని మరింత హెల్తీగా మార్చడానికి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా జోజించవచ్చు. అయితే ఆయుర్వేదం ప్రకారం పాలు, మామిడిపండు కాంబినేషన్ ఎక్కువగా తీసుకోకూడదు, కాబట్టి పరిమిత మోతాదులోనే తాగడం మంచిది.

  • ఇతర పద్ధతులు: మీరు కావాలనుకుంటే మామిడి పన్నా (Mango Panna), మామిడికాయ పచ్చడి లేదా సలాడ్స్ రూపంలో కూడా దీనిని మీ డైట్‌లో భాగం చేసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం!

రాత్రి భోజనం చేసిన వెంటనే లేదా అర్ధరాత్రి పూట మామిడి పండును తినడం పూర్తిగా మానేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా బరువు పెరిగే అవకాశం ఉంది. మామిడి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, దీనిని అమితంగా కాకుండా ఒక పరిమితి లోపల మాత్రమే తినడం చాలా ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *