The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘రాజా సాబ్’ మూవీ వచ్చే వేసవిలో విడుదల కాబోతోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మారుతీ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే 1994లో వచ్చిన ఓ హిందీ సినిమాలోని పాటను ఇందులో సంగీత దర్శకుడు తమన్ రీమిక్స్ చేయబోతున్నాడట. సంజయ్ దత్ హీరోగా నటించిన ‘ఇన్సాఫ్ అప్నే లాహూ సే’ సినిమాలోని ‘హవా హవా.. యే హవా’ సాంగ్ అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. ఆ పాటను ‘రాజా సాబ్’లో రీమిక్స్ చేయబోతున్నట్టు గా సమాచారం. ‘సలార్, కల్కి 2898 ఎ.డి.’తో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ప్రభాస్ ‘రాజా సాబ్’లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.