Gold: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం బంగారం కొనుగోలులో భారత్ చైనాను అధిగమించింది. బంగారం ధర పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.. దీనికి సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన రిపోర్ట్ చాల విషయాలు బయటపెట్టింది. బంగారు నాణేలు, కడ్డీల కొనుగోళ్లలో భారతీయ వినియోగదారులు చైనాతో పోలిస్తే 51% ఎక్కువ బంగారం కొనుగోలు చేశారు.
ఈ కాలంలో చైనీయులు 165 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. మన దేశంలో 248.3 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. భారత్‌లో బంగారం డిమాండ్ ఏటా పెరుగుతోంది. జూలై 23న బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుండి 6%కి తగ్గించడం వల్ల, జూలై నుండి సెప్టెంబర్ అంటే మూడవ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 18% పెరిగింది.
ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయి
Gold: ఈ ఏడాది మూడో త్రైమాసికంలో చైనీయులు 103 టన్నుల బంగారు నాణేలు, కడ్డీలను కొనుగోలు చేయగా, భారతీయులు 172 టన్నుల బంగారు కడ్డీలు, నాణేలను కొనుగోలు చేశారు. జూలై చివరి నాటికి బంగారం కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది. సెప్టెంబర్ మధ్య నాటికి బంగారంపై పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. ఎక్కువ మంది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది.