Narendra Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఏక్తా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే విధానం త్వరలో అమలులోకి వస్తుందని వెల్లడించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఒక మెగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ వస్తోంది.
ఇది కూడా చదవండి: Gold: చైనాను మించిపోయేలా బంగారం కొనేస్తున్న భారతీయులు
ఈ ఏడాది జాతీయ ఐక్యతా దినోత్సవంలో పాల్గొన్న మోదీ.. ‘‘ఈ జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రత్యేకమైనది. దీపావళితో కలిసి దీనిని జరుపుకోవడం మంచి అనుభూతి. దీపాల పండుగ దీపావళి దేశాన్ని వెలిగించడమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానించడం ప్రారంభించిందని అన్నారు.
దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలపరిమితిలో నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను త్వరలో అమలు చేస్తుందని ఈ సందర్భంగా మరోసారి ప్రధాని మోదీ చెప్పారు.