Ladakh: నవంబర్ 1 నుంచి తూర్పు లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దులో భారత సైన్యం పెట్రోలింగ్ ప్రారంభించింది. డెమ్‌చోక్ వద్ద ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. డెప్సాంగ్ వద్ద త్వరలో పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది. అయితే, పగటి పూట మాత్రమే ఈ పెట్రోలింగ్ ఉంటుందని అధికారులు చెప్పారు. మరోవైపు చైనా సైనికులు గస్తీ తిరుగుతున్నారా.. లేదా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
ఇది కూడా చదవండి: Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రదాడి.. ఇద్దరు యూపీ వర్కర్స్ కాల్చివేత!
ఈ రెండు ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లేందుకు ఇరు దేశాల సైన్యాల మధ్య ఒప్పందం కుదిరింది. అక్టోబరు 30న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఇటీవల దీపావళి సందర్భంగా, రెండు దేశాల అధికారులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. తూర్పు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, కారకోరం పాస్, దౌలత్ బేగ్ ఓల్డీ, కొంగలా, చుషుల్-మోల్డో ప్రాంతాల్లో నియంత్రణ రేఖ (LOC) వద్ద ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.