Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లోని మజమా గ్రామంలో ఉగ్రవాదులు ఇద్దరు కాశ్మీరీయేతరులను కాల్చిచంపారు. ఉగ్రవాదుల కాల్పులతో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఇద్దరూ మరణించారు. మృతులను సుఫియాన్, ఉస్మాన్‌గా గుర్తించారు. వీరిద్దరూ యూపీలోని సహరన్‌పూర్ వాసులు. బుద్గామ్‌లోని జల్ జీవన్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. గత 12 రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో కాశ్మీరీయేతరులపై దాడి జరగడం ఇది రెండోసారి. అక్టోబరు 20న గందర్‌బల్ జిల్లాలోని గగాంగీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు 7 మందిని కాల్చిచంపారు. వీరిలో ఒకరిని వైద్యుడు షానవాజ్ అహ్మద్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Narendra Modi: త్వరలోనే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటున్న ప్రధాని మోదీ