Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్డు వద్ద తెల్లవారు జామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఆర్టిసి బస్సు వెనుకనుంచి ఢీకొనడంతో సుమారు 30 మందికి పైగా గాయాలైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి (రాజమండ్రి) గోకవరం కు ప్రయాణికులతో వెళుతున్న మహి ట్రావెల్స్ బస్సు కోదాడ సమీపంలోకి రాగానే ప్రయాణికుల కోసం రోడ్డు పక్కకు ఆపి తిరిగి వెళ్లే క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వేగంగా ఢీకొంది.
ఇది కూడా చదవండి: ASK KTR: అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా
ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోనే ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ప్రమాదానికి కారణం ఆగి ఉన్న బస్సు ఒక్కసారిగా రోడ్డుమీదికి రావడం తోనే జరిగినట్లు తెలిసింది.