Indian Airports Reopened: భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం పౌరవిమాన సర్వీసులను మూసి వేసిన భారత్లోని 32 విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకున్నాయి. గత వారం ఉత్తర, పశ్చిమ భారత్లోని ఆ విమానాశ్రయాల నుంచి సోమవారం (మే 12) నుంచి విమాన సర్వీసులు నడువనున్నాయి. వాస్తవంగా మే నెల 15 వరకు విమానాశ్రయాలను మూసి ఉంచాలని నిర్ణయించారు. కానీ, కాల్పుల విరమణ ప్రకటనతో ముందుగానే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
Indian Airports Reopened: ఈ మేరకు ఆ 32 విమానాశ్రయాల నుంచి పౌరవిమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఏఏఐ నోటీసులను జారీ చేసింది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన కారణంగా పరిస్థితులు మెరుగు పడటంతో విమానాల రాకపోకలు మెరుగుపడనున్నాయి.
Indian Airports Reopened: దేశభద్రతా కారణాల రీత్యా ఏఏఐ అధికారులు పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే విమానాశ్రయాలను తిరిగి పునఃప్రారంభించేందుకు అనుమతించినట్టు సమాచారం. దీంతో ఆ 32 విమానాశ్రయాల నుంచి పౌరవిమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

