T20I Series

T20I Series: భారత్ తో పోటీ.. ఆస్ట్రేలియా వన్డే, T20 సిరీస్ జట్ల ప్రకటన!

T20I Series: భారత్‌తో జరిగే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. సాధారణ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో, రెండు ఫార్మాట్‌లలోనూ మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఆస్ట్రేలియా వన్డే జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

ఆస్ట్రేలియా టీ20 జట్టు(మొదటి రెండు మ్యాచ్‌ల కోసం):
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

ఇది కూడా చదవండి: Shakthi Sadhan Scam: కడప నడిబొడ్డున షాకింగ్‌ ఘటన!

అక్టోబరు 19 నుంచి వన్డే సిరీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత 5 టీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా బడా ప్లేయర్లతో స్క్వాడ్‌లను సెలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ వన్డే జట్టులో ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. లబుషేన్ స్థానంలో క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మెన్ మ్యాథ్యూ రెన్షాకు వన్డే జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్లుగా అలెక్స్ క్యారీతో పాటు జోష్ ఇంగ్లిస్ను ఎంపిక చేశారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ జట్టులోకి తిరిగి వచ్చాడు. బ్యాటింగ్ విభాగంలో ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ వంటి బడా ప్లేయర్స్ ఉన్నారు. వీరితోపాటు యువ పేసర్లు గ్జావియర్ బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్లకు అవకాశం లభించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *