DGMO Meeting: భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హాట్‌లైన్ ద్వారా ఇరు దేశాల డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య శాంతి పరిరక్షణకు దోహదపడే చర్చలు ప్రారంభమయ్యాయి.
ఈ సమావేశంలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా, ముఖ్యంగా కాల్పుల విరమణ అమలును బలపరచే విషయంలో వారు చర్చించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిణామాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Crime News: హైదరాబాద్‌లో దారుణం.. వాచ్‌మన్‌ను హత్య చేసిన గంజాయి బ్యాచ్
గతంలో, ఈ నెల 10వ తేదీన సాయంత్రం కాల్పుల విరమణపై ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే, అనంతరం పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి మరోసారి కాల్పులు జరిపినట్టు భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తాజా చర్చలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అంతర్జాతీయ మద్ధతుతో శాంతి చర్చలు జరగడం, భారత విభాగం నుంచి స్పష్టమైన విధానంతో స్పందన రావడం, ఈ పరిణామాలను గమనించే అంశాలు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడమే ఇరు దేశాల ప్రయోజనాల్లో భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.