Delhi::భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు మళ్లీ ఒక భారీ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. భారత నౌకాదళం కోసం సుమారు రూ. 63 వేల కోట్ల విలువైన డీల్‌ను ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళ అవసరాలకు అనుగుణంగా 26 రాఫెల్ మెరైన్ విమానాలను కొనుగోలు చేయనున్నారు.
ఈ ఒప్పందంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను లు అధికారికంగా సంతకాలు చేశారు. ఈ విమానాలు భారత నౌకాదళానికి ప్రధాన బలాన్ని చేకూర్చనున్నాయి.
ప్రణాళిక ప్రకారం, ఈ రాఫెల్ మెరైన్ విమానాలను 2030 నాటికి భారత్‌కు అప్పగించనున్నారు. సముద్రంలో హవామాన పరిస్థితులు తట్టుకునే విధంగా వీటిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ రంగ సహకారం మరింత బలపడనుంది.